- 40 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు
పాట్నా: బీహార్‌లోని నలంద జిల్లాలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. పరాసి మిడిల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం చేసిన సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు రావడంతో వారిని బీహార్ షరీఫ్ మోడల్ ఆసుపత్రికి తరలించారు.
పాఠశాల అధికారుల వివరాల ప్రకారం, మధ్యాహ్న భోజనంలో అందించిన సోయాబీన్‌లో ఉప్పు తక్కువగా ఉందని విద్యార్థులు చెప్పడంతో, వంట సిబ్బంది పొరపాటున ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ కలిపినట్లు తెలిపారు. ఆహారాన్ని మరో పాఠశాల నుంచి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ పౌడర్ డబ్బాలను ఒకే చోట ఉంచడం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.







కామెంట్‌లు (0)