బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

World Photography Day - ఒక్క ఫోటో ... ఎన్నో జ్క్షాపకాలు..!

1 గంట క్రితం

World Photography Day – One photo... so many memories!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 02:37 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

కాలాన్ని ఒకే ఒక్క క్లిక్ తో ఆపేదే ఫోటో..! ఎన్నేళ్లయినా ఆ ఫోటో మధుర జ్క్షాపకం.. మనస్సును అమాంతం కొన్నేళ్లు వెనక్కు తీసుకెళ్లే భావోద్వేగం..! ఫోటోను చూస్తే చాలు ... ఇది అప్పటి ఫోటో.. అలా జరిగింది.. అలా ఉన్నాం... అంటూ... వెనక్కు వెళ్లిపోతారు.. ఎన్నో జ్క్షాపకాలు కళ్లముందే కనబడతాయి... సంతోషం, విచారం.. ఇలా ఎన్నో..! గుండెను ఓసారి తట్టి లేపుతుంది ఫోటో..! ఈ కళారూపాన్ని పురస్కరించుకుని ... ప్రతి సంవత్సరం ఆగస్టు 19 న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఫోటోగ్రఫీని కెరీర్‌గా కొనసాగించేందుకు ఔత్సాహికులను ప్రేరేపించే రోజుగా కూడా ఇది ఉపయోగపడుతుంది.

World Photography Day – One photo... so many memories!


కాస్త పక్కకు జరగండి.. పౌడర్ రాసుకోండి.. నవ్వండి.. ప్లీజ్ ..! ఇలా ఒకప్పుడు ఎంతో అలర్ట్ గా ఉండి ఫోటోలు దిగిన 19వ శతాబ్దం ప్రారంభం నుండి ... ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్ లలో కూడా అందంగా, ఆనందంగా ఫోటోలు తీసుకుంటున్నారు..! నేటి కాలంలో ఫోటోగ్రఫీ అనేది ఒక్క గొప్ప కళ. ఎంతోమంది యువకులకు ఉపాధి అందిస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఒక వేదికలా నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వారికి గుర్తింపు సంపాదించేలా దోహదపడుతున్నాయి. ఫోటోగ్రఫిలో రాణించడం అంత సులువు కాదు. ఒక చిత్రాన్ని కెమెరాలో బంధించాలంటే మొదట తన మనసులో రూపాన్ని అందంగా ఊహించుకోగలగాలి. అంతే అందంగా ఆ చిత్రం కంటి ముందుకు తీసుకు వచ్చేలా చూడగలగాలి. ఎన్నో ఏళ్ళుగా వారు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా చెప్పవచ్చు.


భారతదేశంలోకి ఫోటోగ్రఫీ 1840లలో ప్రవేశించింది.

భారతదేశపు మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ హోమై వ్యారావాలా


ఒక మాట వేల మందిని ప్రశ్నిస్తుంది.. కానీ ఒక చిత్రం కోట్ల మంది ఆలోచనను మారుస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ స్పందన కలిగిస్తుంది. ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం అని అంటారు. ఫోటోలు పదాల కంటే వేగంగా, కొన్నిసార్లు మరింత ప్రభావవంతంగా ఒక భావనను తెలియజేయగలవు. ఒక ఫోటో, చూసేవారిని ఫోటోగ్రాఫర్ చూసే విధంగానే ప్రపంచాన్ని చూసేలా చేయగలదు. ఫోటోలు కాలగమనాన్ని కూడా అధిగమిస్తాయి - వంద సంవత్సరాల క్రితం తీసిన ఫోటోను అప్పుడు ఎంతగా ఆస్వాదించారో, ఇప్పుడూ అంతే ఆస్వాదించవచ్చు. రేపు తీసిన ఫోటోను, వంద సంవత్సరాల తర్వాత కూడా ఇతరులు అంతే ఆస్వాదించవచ్చు..!


World Photography Day – One photo... so many memories!

ఒక అందమైన ఫోటో వెనుక ఫోటోగ్రాఫర్‌ కఠోర శ్రమ, పరిశీలన, ఓపిక, సృజనాత్మకత, సమయస్ఫూర్తి ఉంటాయి. కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఖరీదైన పరికరాలు, ప్రయాణం, నిర్వహణ, డేటా నిల్వ, ఎడిటింగ్ వంటి ఖర్చులు కూడా వారిపై ఆర్థిక భారాన్ని మోపుతాయి. ముఖ్యంగా ఫోటో జర్నలిస్టుల బాధ్యత మరింత కష్టతరంగా ఉంటుంది. రాజకీయాలు, ప్రజా ఉద్యమాలు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ఎన్నికలు, సామా జిక సమస్యలు, క్రీడలు ఇలా ఎన్నో ... ప్రతి కీలక సంఘటనను వారు కెమెరాలో బంధిస్తారు. వార్తను చదివితే విషయం తెలుస్తుంది. కానీ అదే సంఘటనను ఫోటోగా చూస్తే దాని తీవ్రతను మనసుతో అనుభవిస్తాం. అందుకే ఫోటో జర్నలిజం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన సాధనమయ్యింది. సాంకేతికత అభివృద్ధి చెందినా ఫోటోగ్రాఫర్‌ చూపు, ఆలోచన, అనుభూతిని ఏ పరికరం పూర్తిగా భర్తీ చేయలేదు అనేది స్పష్టం. ఫోటో గ్రాఫర్లకు గుర్తింపుతో పాటు తగిన పారితోషికం, గౌరవం, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలి. ప్రభుత్వం వారిని మరింతగా ప్రోత్సహించాలి.
భారతదేశపు మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ హోమై వ్యారావాలా
భారతదేశపు అగ్రగామి ఛాయాచిత్రకారుడు రాజా లాలా దీన్ దయాళ్

భారతదేశంలోకి ఫోటోగ్రఫీ 1840లలో ప్రవేశించింది. అయితే ఒక నిర్దిష్టమైన తొలి ఫోటో అని చెప్పడానికి ఏ ఒక్క చిత్రం అధికారికంగా రికార్డ్ చేయబడలేదు. 1850ల నాటికి బ్రిటీష్ ఫోటోగ్రాఫర్స్ మరియు సర్జన్లు దేశంలోని కట్టడాలను, దేవాలయాలను చిత్రించడం ప్రారంభించారు. తొలి భారతీయ ప్రముఖ ఫోటోగ్రాఫర్‌గా, ఫోటోగ్రఫీ పితామహుడిగా రాజా దీన్ దయాళ్ (లాలా దీన్ దయాళ్) గుర్తింపు పొందారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న కెమెరా కళను భారతీయ దృక్పథంలోకి మార్చి హైదరాబాద్ సంస్కృతికి ఒక దృశ్య రూపాన్ని (Visual Identity) అందించిన గొప్ప కళాకారుడు రాజా దీన్ దయాళ్. హైదరాబాద్ ఫోటోగ్రఫీ చరిత్రలో రాజా దీన్ దయాళ్ పాత్ర అత్యంత కీలకం. ఆయన మొదట చిత్రకారుడిగా నైపుణ్యం సాధించి వ్యాపార దృక్పథంతో సికింద్రాబాద్, బొంబాయి, మద్రాసు, ఇండోర్ వంటి నగరాల్లో స్టూడియోలను స్థాపించాడు. అవి కాలక్రమేణా ఫోటోగ్రఫీ కళకు ఒక బ్రాండ్‌గా పేరు ప్రతిష్టను సంతరించుకున్నవి. ఆంగ్లేయుల ఉనికి స్పష్టంగా కనిపించే ఆ వలస కాలంలో బౌర్న్ & షెపర్డ్, జాన్‌స్టన్ & హాఫ్‌మాన్‌లతో సహా ఎందరో యూరోపియన్ ఫోటోగ్రాఫర్‌లకు, ఫోటోగ్రాఫిక్ సంస్థలకు భారతదేశం నిలయంగా ఉండేది. కానీ 1903 నాటి ఢిల్లీ దర్బార్ అనే ఆ అత్యంత వైభవమైన దృశ్యానికి సంబంధించిన ఛాయాచిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అవి రాజా దీన్ దయాళ్‌ తీసిన ఫొటోలే. హైదరాబాద్‌లో ఫోటోగ్రఫీ ఆరంభం 1850–1870ల మధ్యకాలంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. మొదటి భారతీయ ఫోటోగ్రాఫర్ .... 1870ల నుండి రాణా దీన్ దయాళ్ తన కెమెరా ప్రస్థానం ప్రారంభించి రాచరిక కుటుంబాలు, చారిత్రక కట్టడాలను ఫోటోలు తీశారు.మొదటి సెల్ఫీ ..... త్రిపుర మహారాజా బీర్ చంద్ర మాణిక్య, ఆయన భార్ మహారాణి మన్మోహిని దేవి 1880లో నాటి కాలంలోనే ఒక సెల్ఫీ ఫోటో తీసుకున్నట్లు చరిత్రలో రికార్డు ఉంది.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్