బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ సంస్కృతి, విశిష్టత ప్రతిబింబించేలా సమ్మిట్‌‌ నిర్వహించాలి

2 గంటల క్రితం

తెలంగాణ సంస్కృతి, విశిష్టత ప్రతిబింబించేలా సమ్మిట్‌‌ని నిర్వహించాలి
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
‎ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


‎ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

‎రాష్ట్రంలో నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా, తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. .ఫైవ్ స్టార్ హోటళ్ల వాతావరణం దేశవ్యాప్తంగా ఎక్కడైనా సాధారణంగానే ఉంటుందని, అయితే మన రాష్ట్ర ప్రత్యేకతను విదేశీ, జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి ప్రత్యేక వంటకాలు ఈ ఈవెంట్‌లో ప్రధానంగా ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారిణి హరిచందనకు సూచించారు. బతుకమ్మ వంటి పండుగల నిర్వహణ మనకు కొత్తేమీ కాదని, గతంలోనూ సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేస్తూ, సాంస్కృతిక శాఖ సమన్వయంతో మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సాధారణ హోటళ్ల వాతావరణం అంతర్జాతీయ, జాతీయ అతిథులకు అంత ప్రత్యేకంగా అనిపించకపోవచ్చని, కాబట్టి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించడానికి ఇదొక అద్భుత అవకాశమని పేర్కొన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దాదాపు 2,000 నుండి 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి మన సంస్కృతి ఒక దృశ్యకావ్యంగా నిలిచిపోవాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన జి20, బ్రిక్స్ సమ్మిట్‌ల తరహాలోనే సాయంత్రం వేళల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మన వారసత్వాన్ని సమున్నతంగా చాటిచెప్పేలా ప్లాన్ చేయాలన్నారు.

‎రాష్ట్రానికి ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమైనప్పటికీ, అంతర్జాతీయ వేదికపై నూతన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత అని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్