తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మబ్బు పట్టి ఉందని, వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో నిన్న హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షం కురిసింది.
Rains - హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ..!
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 11:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)