తెలంగాణ : పదేళ్ల పాలనలో కెసిఆర్ మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కెటిఆర్ సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. చెల్లి ఏదైనా తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునేవాడే అన్న అని.. కెటిఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన చెల్లిని బయటకు పంపించేశారన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని హకీంపేటలో మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నవంబర్ 19న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వనున్నామని ప్రకటించారు. ‘‘పిల్లల చదువు, ఎదుగుదలే మహిళల అసలైన అభ్యున్నతి. ప్రతి ప్రభుత్వ పథకంలో మహిళలనే భాగస్వాములుగా చేస్తాం. ఆడబిడ్డలకు భరోసా ఉండాలని ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరిటే ఇచ్చాం. బియ్యం, కరెంట్ బిల్లు, బస్సు ఛార్జీల రూపంలో గతంలో ఎంతో ఖర్చు చేసేవారు. ఆర్థిక భారం తగ్గించాలని ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. ఆటో డ్రైవర్లతో బిఆర్‌ఎస్ నేతలు గొడవ చేయించారు. 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని పథకాలను తీసుకొచ్చా. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేశాం. హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన ఇందిర మహిళా శక్తి స్టాళ్లు, క్యాంటీన్లు కేటాయించాం. కెసిఆర్, కెటిఆర్ పదేళ్లలో మహిళలకు ఏమిచ్చారో అడగండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
మహిళలకు కెసిఆర్ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు : సిఎం రేవంత్
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)