శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కి ఫోన్‌

12 గంటల క్రితం

Phone call to MLA Rajagopal Reddy from the Congress leadership
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కి శనివారం ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ నెల 23 న కొత్త ఇన్‌ఛార్జ్‌ సందీప్ ‌తో సమావేశం కావాలని ఎఐసిసి కార్యదర్శి సూచించారు. ఇదిలా ఉండగా ... రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పిసిసి అధినేత మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని, రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను ఎఐసిసి పరిశీలిస్తోందని అన్నారు. క్రమ శిక్షణ చర్యలపై ఎఐసిసి స్పందిస్తుందని హెచ్చరించారు. ‘ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా చేసిన నిన్నటి రోజున వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్