కొత్తగూడెం: బిఆర్‌ఎస్‌లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) అధ్యక్షురాలు కె.కవిత స్పష్టం చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలో ఆమె పర్యటించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోని రూ.1,400 కోట్లు అమరుల కుటుంబాలకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ డబ్బు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది కాదా అని బిఆర్‌ఎస్‌ను నిలదీశారు. తమ పార్టీతో భయం లేదంటూనే ఇసికి వెయ్యికి పైగా ఫిర్యాదులు ఇచ్చారని విమర్శించారు. టిఆర్‌ఎస్ పేరు తనకు రాకుండా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి నీతినియమాలు లేవని మండిపడ్డారు. తల్లి, చెల్లి అనే సభ్యత మరిచి బిఆర్‌ఎస్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని, తన కంఠంలో ప్రాణముండగా తిరిగి బిఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తన పోరాటాలు ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బిజెపి చేతులు కలిపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్ ప్రోకో కింద కేటీఆర్ అక్రమ పర్మిషన్లు ఇచ్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీశ్‌రావు అనకొండ అని అన్నారు. అయినా బిఆర్‌ఎస్ ఇంకా ఆయన్నే ముందుకు తీసుకువెళుతోందని, ఆ పార్టీ బాగుపడదని మండిపడ్డారు. కెసిఆర్‌కు మరకలు అంటించిన ఆయనకు 3 నెలలు మంత్రి పదవి కావాలంట అని ఎద్దేవా చేశారు. కెటిఆర్ ఇటీవల రూ.188 కోట్లతో ఓ ఇంగ్లిష్ పత్రిక కొన్నారని, ఫీనిక్స్ సంస్థకు రూ.80వేల కోట్ల విలువైన భూముల కట్టబెట్టారని అన్నారు. ప్రస్తుతం ఆ సంస్థ రూ.33 లక్షల టన్నుల కలప కొట్టేస్తోందని ఆరోపించారు.
బిఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు :కె. కవిత
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 04:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)