- తూర్పు, పోలవరం జిల్లాల్లో భారీ వర్షం
ప్రజాశక్తి - చాగల్లు (తూర్పుగోదావరి జిల్లా) వై.రామవరం (పోలవరం జిల్లా) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాల చెరువులో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాగల్లు మండలంలో హఠాత్తుగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒకేసారి ఉరుములతో కూడిన భారీ వర్షం వ్యవసాయానికి ఎంతో మేలని రైతులు ఆనంద పడ్డారు. ఇప్పటి వరకూ వర్షం సరిగ్గా పడకపోవడం దమ్ములకు నీరు అందడం లేదని నిరాశకు గురైన రైతులు ఒకేసారి వర్షం పడటంతో ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట, జగ్గంపేటలో భారీ వర్షం కురిసింది. పోలవరం జిల్లా వై.రామవరంలో ఆదివారం ఉదయం వర్షం కురిసింది. సుమారు 25 రోజులుగా ఈ ప్రాంతంలో వర్షం లేదు. దీంతో రైతులు వ్యవసాయ పనులకు దూరంగా ఉన్నారు. తాజా వర్షంతో వ్యవసాయ పనులకు ఊతమిచ్చినట్టవడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)