గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

21 జూన్, 2026

Protest with empty pots
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 11:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని 27 28 ఎన్నికల వార్డులకు చెందిన ప్రజలు ఆదివారం రాయదుర్గంలోని పట్టణంలోని బళ్ళారి రోడ్డు వన్నూరు స్వామి కట్ట వద్ద ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా త్రాగునీరు కొళాయిలలో సక్రమంగా సరఫరా కావడం లేదని అన్నారు. పది రోజులకోసారి కొద్దికొద్దిగా నీళ్లు అపరిశుభ్రమైనవి రంగు మారినవి వస్తున్నాయని, తాము ఎలా బతికేదని నిలదీశారు. సుమారు గంటసేపు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పి వెంటనే ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తామని నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్