ఎంత చక్కగా.. వేగుచుక్కగా
వెలిగిపోతున్నదో చూడూ!
తూరుపు కనుబొమల మధ్య
తొలి వెలుతురు తోడూ!
జోయమ్మా..జేజేయమ్మా..
జోయమ్మా..జోహార్లమ్మా..
అంటరాని కన్నీరు
ఆలోచన కదిపింది,
ఇంటికి రానివ్వని
మహిళ మనసు మెదిలింది!
లోకంలో బలహీనుల
శోకం గతి తెలిసింది,
నిలువెల్లా తనువు కరగి
మానవీయమయ్యింది!
జేజేలమ్మా.. జోహార్లమ్మా
అమ్మ ఒడిలో అనురాగం
ఓనమాలు దిద్దావూ
పెద్దమ్మ బడిలో ఉద్యమాల
పాఠాలు చదివావూ!
గుండెలపై తుపాకీ
గురిచూసి పెట్టినా,
తలవంచని తండ్రి మేలి
తలపుల్లో పెరిగావూ!
జోయమ్మా..జోహార్లమ్మా
అజ్ఞాత యోధులే
విజ్ఞాన దాతలు,
త్యాగధనుల స్నేహాలే
దారి పొడవు జ్యోతులు!
దేశభక్తి.. ప్రజాశక్తి
భావాలకు ప్రతిరూపం,
జీవించిన కాలమే
భావికి నీ సందేశం!
జోయమ్మా..జేజేయమ్మా
జోహార్లమ్మా..జోయమ్మా..
- నల్లి ధర్మారావు, సెల్: 76609 67313








కామెంట్‌లు (0)