సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫ్రాన్స్‌లో అంధకారంలో వేలాది కుటుంబాలు

24 జూన్, 2026

France heatwave's first major outage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 01:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పారిస్‌ : వాయువ్య ఫ్రాన్స్‌లో విద్యుత్‌ అంతరాయంతో వేలాది కుటుంబాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఐరోపాను కుదిపేస్తున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావంతో సుమారు 68,000కుటుంబాలకు విద్యుత్‌ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఇటీవలి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇది దేశంలో నమోదైన తొలి విద్యుత్ అంతరాయం. విద్యుత్‌ గ్రిడ్‌లోని ఒక ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏర్పడిన లోపం కారణంగా ఈ అంతరాయం సంభవించిందని ఫినిస్టెర్ తీరప్రాంత ప్రిఫెక్చర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తీవ్ర ఉష్ణోగ్రతలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో బ్రిటనీ ప్రాంతంలోని క్వింపర్ నగరానికి సమీపంలో ఉన్న ఎర్గు-గాబెరిక్ కమ్యూన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు ఫ్రెంచ్ విద్యుత్ గ్రిడ్ నిర్వహణ సంస్థలు ఆర్‌టిఇ, ఎనెడిస్ సిబ్బంది రాత్రంతా శ్రమించినప్పటికీ, విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరించలేకపోయారని అన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.


తీవ్రమైన వేడిగాలుల కారణంగా ఫ్రాన్స్‌ మంగళవారం చరిత్రలోనే అత్యంత వేడి రోజును నమోదు చేసింది. మరోవైపు మంగళవారం సాయంత్రానికి ఫ్రెంచ్ విద్యుత్ నెట్‌వర్క్‌కు చెందిన 1,06,000 మంది వరకు వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా బ్రిటనీ నుండి పారిస్ ప్రాంతం వరకు 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో ఫినిస్టెర్ సహా 58 ఫ్రెంచ్ డిపార్ట్‌మెంట్లకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు.


వేడి గాలిని అనేక రోజుల పాటు ఒకే ప్రాంతంలో నిలిపివేసే ప్రత్యేక వాతావరణ, గాలి ప్రసరణ విధానాలే ఈ తీవ్ర ఉష్ణ పరిస్థితులకు కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఇటువంటి పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్