ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : మహారాజా అటానమస్ కళాశాలలో ఎలాంటి షరతులు లేకుండా, పరీక్షలకి అనుమతి ఇవ్వాలంటూ .. మంగళవారం కళాశాల గేట్ ముందు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్దులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి డి. రాము మాట్లాడుతూ ... విద్యార్థులు కళాశాలలో చేరినపుడు జీరో ఫీజ్ అని చెప్పి ఇప్పుడు ఫీజ్ కడితే కానీ పరీక్షలకి లోపలికి పంపించబోం అని, హాల్ టికెట్స్ ఇవ్వము అని విద్యార్థులపై యాజమాన్యం ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్దుల మీద కూడా ఒత్తిడి పడుతుందని తెలిపారు. కాబట్టి పరీక్షలు అయ్యేంత వరకు ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా పరీక్షలకి అనుమతి ఇవ్వాలని, దీనికి సమాధానం కళాశాల ప్రిన్సిపాల్ చెప్పాలని కోరారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ స్పందించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలకి అనుమతి ఇస్తామని హామీ ఇవ్వడం తో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ వి.భారతి , పట్టణ అధ్యక్షులు సూరిబాబు , నాయకులు గుణ , విద్యార్థులు పాల్గొన్నారు.
మహారాజా కళాశాలలో ఫీజులు కట్టాలనే ఒత్తిడి ఆపాలని ఎస్ఎఫ్ఐ ధర్నా
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)