మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి : సిఐ లక్ష్మన్న

25 జూన్, 2026

One must be aware of laws concerning women
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 02:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ : మహిళా చట్టాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని తలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మన్న తెలిపారు. మండల కేంద్రమైన కలకడ కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో బాలికలకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానమని చట్టాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే మహిళా చట్టాలు పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణతో మెలిగి, మంచి ప్రవర్తన కలిగి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తెచ్చేలా చదువుకోవాలన్నారు. మహిళా చట్టాలైన పిల్లల భద్రత, బాల్య వివాహాలు, ప్రేమ పేరుతో మోసపోయి పారిపోవడం, ఫోక్సో, సైబర్ క్రైమ్, వంటి చట్టాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. అలాగే బాల్యవివాహాలను చేసుకున్న, వివాహాలు చేసిన, వాటిని ప్రోత్సహించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని, వాటిపై కూడా విద్యార్థి దశనుండే అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు, చిన్న వయస్సులోనే ప్రేమ పేరుతో పారిపోయి వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమని విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామాంజనేయులు, ప్రిన్సిపాల్ శ్రావణి, ఉపాధ్యాయురాళ్లు, పోలీసు సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్