బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘లీసా’ అనన్య

1 గంట క్రితం

annanya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనన్య నాగళ్ల ఒక సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘లీసా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో అనన్య నాగళ్ల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఓంశ్రీరామ్ ఆర్ట్స్, అయాన్ష్ రెడ్డి ప్రజెంట్స్, ఐరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు వెంకట్ దుగ్గిరెడ్డి, ఇలా రామకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా, మేకర్స్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ల ‘లీసా’ అనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్