బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ ప్రారంభం

1 గంట క్రితం

nimmakaya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరోహీరోయిన్లుగా, సీనియర్ నటులు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో, బి.వి.సి. ఫిల్మ్స్ బ్యానర్‌పై ‘నిమ్మకాయ నీకెందుకు భయం’ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేట సారథి స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టగా, లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించి చిత్ర యూనిట్‌కు తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ‘Eట్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోశిరెడ్డి పందిళ్లపల్లి ఈ విభిన్న కథా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేటికీ ప్రజలను పట్టి పీడిస్తున్న కొన్ని మూఢనమ్మకాలను ఎండగడుతూ, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సరికొత్త కథనంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్