కలికిరి (అన్నమయ్య) : కలికిరి మండలములోని అన్ని గ్రామ పంచాయతీలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులు, పీడిఓ ల ఆధ్వర్యములో ర్యాలీ, ప్రతిజ్ఞ ను చేపించి ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లు, ప్రభుత్వ భవనాలు తదితర ప్రభుత్వ ఆస్తుల దగ్గర చెత్త, తదితర ప్లాస్టిక్ వస్తువుల వాడకం ఫై ప్రజలకు అవగాహన కల్పించారూ. తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసే విధానాన్ని మొదలగు విషయాల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ అభివృద్ధి అధికారి జి.అశోక్, ఎంపిడిఓ భాను మూర్తి రావు, డిప్యూటీ ఎంపిడిఓ మహమ్మద్ రియాజుద్దీన్, వినయ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేణుగోపాల్ రెడ్డి, మండల స్వచ్ఛ భారత్ మిషన్ రిసోర్స్ కోఆర్డినేటర్ శంకర్, సచివాలయం, ఉపాథి, ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
20 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)