mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈవీఎం గోదాంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి తనిఖీ

1 రోజు క్రితం

District Election Officer and Collector Keerthi Chekuri inspects EVM warehouse.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సోమవారం రాజమహేంద్రవరంలోని ఎఫ్‌సీఐ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం (EVM) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పుటేజ్, రికార్డులను పరిశీలించి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా అమలులో ఉన్నాయని నిర్ధారించారు. ఈ తనిఖీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు టీడీపీకి చెందిన సలాది ఆనంద్, బిజెపి కి చెందిన బి. రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. శివరాముడు, అర్బన్ తహసీల్దార్ యు. రంజిత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్