బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరోగ్య అవగాహన కల్పనలో ప్రజాశక్తి పాత్ర ప్రశంసనీయం : డాక్టర్స్ డే ప్రత్యేక సంచికలను ఆవిష్కరించిన వైద్యులు

2 గంటల క్రితం

ఆరోగ్య అవగాహన కల్పనలో ప్రజాశక్తి పాత్ర ప్రశంసనీయం  : డాక్టర్స్ డే ప్రత్యేక సంచికలను ఆవిష్కరించిన వైద్యులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రకాశం : ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ, ఆరోగ్య సంబంధిత అంశాలను బాధ్యతాయుతంగా ప్రచురిస్తున్న ప్రజాశక్తి సమాజానికి విశేష సేవలు అందిస్తోందని పలువురు ప్రముఖ వైద్యులు అభిప్రాయపడ్డారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రజాశక్తి ప్రత్యేకంగా ప్రచురించిన వైద్య ప్రత్యేక సంచికలను బుధవారం నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఆవిష్కరించారు. స్థానిక ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ పోకూరి శ్రీనివాసరావు, డాక్టర్ ప్రకాష్ చవల, డాక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు వ్యాధుల నివారణ, ఆధునిక వైద్య విధానాలు, జీవనశైలి మార్పులు, సీజనల్ వ్యాధులపై నిరంతరం అవగాహన కల్పించే కథనాలను ప్రజాశక్తి ప్రచురించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్యులతో పాటు బాధ్యతాయుతమైన మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మెడిక్యూర్ హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ కె. శ్రీధర్ బాబు, డాక్టర్ రవళి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య రక్షణకు అవసరమైన అంశాలను సులభమైన భాషలో అందిస్తూ ప్రతి వర్గానికీ చేరువవుతున్న ప్రజాశక్తి సామాజిక బాధ్యతతో కూడిన పాత్రికేయ విలువలను కొనసాగిస్తోందని కొనియాడారు. ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి ప్రత్యేక సంచికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. వైద్య రంగంలోని నిపుణుల అనుభవాలు, ప్రజలకు అవసరమైన ఆరోగ్య సూచనలు, వ్యాధుల నివారణ మార్గాలు, ఆధునిక చికిత్సా విధానాలను ప్రత్యేక కథనాల రూపంలో అందించడం ద్వారా ప్రజాశక్తి పాఠకుల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తోందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక ప్రయోజనకరమైన ప్రచురణలను కొనసాగించాలని ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్