ప్రజాశక్తి-విజయనగరం కోట : భూమి పత్రాల విషయంలో ఎఎస్సై తనను మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ... ఓ మహిళ మండుటెండలో విజయనగరం కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి సోమవారం ఆందోళన చేపట్టింది. బాధితురాలి వివరాల ప్రకారం .... విజయనగరం కోట జంక్షన్ వద్ద స్థానికంగా నివాసం ఉంటున్న ఆకిరి స్వాతి (డాటర్ ఆఫ్ ప్రసాదరావు) అనే మహిళకు 2021 నుండి పూసపేట రేగ మండలం కుమిలి గ్రామంలో 291/2 సెంట్లు భూమి ఉంది. అయితే ఆమెకు అప్పు అవసరమై తనకున్న 291/2 సెంట్లు భూమిని పరిచయస్తుల వద్ద తనఖా పెట్టడానికి చూసింది. ఈ క్రమంలో ఆ అప్పు తానే ఇస్తానంటూ ... విజయనగరం కంట్రోల్ రూమ్ కు చెందిన ఎఎస్ఐ బోండా మురళి చెప్పడంతో స్వాతి నమ్మి తన భూమి రిజిస్ట్రేషన్ పత్రాలన్నిటినీ అతడికి ఇచ్చింది. అయితే ఎఎస్సై జిపిఎ సేల్ అంటూ ... కొన్ని పత్రాలను ఆమెతో రాయించుకొని కొద్ది మొత్తాన్ని ఆమె చేతిలో పెట్టాడు. మిగతా డబ్బును తరువాత ఇస్తానని చెప్పి పంపించాడు. 18 రోజులు గడిచాయి. డబ్బులు ఇవ్వకపోగా ... స్వాతికి చెందిన భూమి పత్రాలను ఎఎస్సై తన అత్త మేకల కమలా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ న్యాయం కోరుతూ తిరుగుతూనే ఉందని, ఆ భూమి తనకు బతకడానికి ఆధారం అంటూ ... బాధితురాలు వాపోయింది. అధికారులు దృష్టి నిలిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ ... కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేపట్టింది.
భూపత్రాల విషయంలో ఎఎస్సై మోసం - మండుటెండలో మహిళ ఆందోళన
22 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 02:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)