సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం నగర పాకల సంస్థలో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పర్మినెంటు కార్మికులకు జాతీయ సెలవులు, పండగల సెలవులు, వారాంతపు సెలవులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకొని 365 రోజులు పనిచేస్తున్న కార్మికులకు విశ్రాంతిని కలుగజేయాలని, కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు, పి.కామేష్ లు డిమాండ్ చేశారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ .... ప్రస్తుతం పర్మినెంటు కార్మికులు రిటైరు అవుతున్నవారికి ఆన్లైన్ విధానం ద్వారా ధరఖాస్తు చెసుకోమని చెప్పియున్నారు. సదరు కార్మికులు నిరక్షరాస్యులు అయింనందు వారికి పాతపద్ధతినే కొనసాగించాలన్నారు. గత సంవత్సర కాలంలో కాంట్రాక్టు మరియు పర్మినెంటు కాంట్రాక్టులలో సుమారు 20 మంది వరకు కార్మికులు పదవీ విరమణ పొందియున్నారు. అలాగే ఈ సంవత్సరము కూడా 12 నుండి 13 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. ఆ యొక్క ఖాళీలలో ఏ ఒక్క కార్మికులను భర్తీచేయకపోవడం, పనిచేస్తున్న కార్మికులపై పనిభారం పడుతుంది వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంటు కార్మికులకు రావలసిన వార్షిక ఇంక్రిమెంట్లును 6, 12,18, 24, 30 సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్లును కార్మికులకమ మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకావాలన్నారు. పర్మినెంటు కార్మికుల యొక్క ఎస్ ఆర్ లను అప్డేటే చేయాలని కోరారు. పారిశుద్య కార్మికుడుగా జాయిను అయి పారిశుద్యకార్మికుడుగా పదవీ విరమణ పొందుతున్నారు. పర్మినెంటు కార్మికులకు ప్రమోషన్, కల్పించాలనీ డిమాండ్ చేశారు. కార్మికులు సకాలంలో పనిముట్లు అందించాలి. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పగలు,రాత్రి కు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి జీతాలను చెల్లించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులు చనిపోయి నేటికి ఒక సంవత్సరము అవుతున్నా వారి కుటుంబాలకు ఎటువంటి ఉపాధి కల్పించాలన్నారు. కార్మికులకుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాలన్నారు. ధర్నా లో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)