mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎక్సైజ్ ఎస్ ఐ పి నరేంద్ర కుమార్

6 రోజుల క్రితం

Youth should stay away from drugs Excise SI P Narendra Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గజపతినగరం (విజయనగరం) : ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా .... స్థానిక శ్రీ కృష్ణ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎక్సైజ్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎక్సైజ్ సి.ఐ. జె.జనార్ధన రావు ఆధ్వర్యంలో, ఎక్సైజ్ ఎస్.ఐ. పి. నరేంద్ర కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ ఐ పి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ .... యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను నెరవేర్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలవినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటిని కలిగి ఉండటం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఎన్‌డిపిఎస్ యాక్ట్, 1985 ప్రకారం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి చట్టపరంగా కఠిన శిక్షలు అమలులో ఉన్నాయని, వాటి గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ అవగాహన సదస్సులో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ పి.బి.ఎస్.వి. రాజు, కళాశాల కరస్మండెంట్ శంకర్, అధ్యాపక సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్