బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తలమంచిపట్నం ఎస్‌ఐగా హైమావతి బాధ్యతల స్వీకరణ

20 జూన్, 2026

తలమంచిపట్నం ఎస్‌ఐగా హైమావతి బాధ్యతల స్వీకరణ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తలమంచిపట్నం (కడప) : తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా హైమావతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన పోలీసు శాఖ బదిలీల్లో భాగంగా జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆమెను తలమంచిపట్నం పోలీస్ స్టేషన్‌కు నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఆమె, పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సత్వర పోలీసు సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ హైమావతి సూచించారు. ఆమె బాధ్యతలు స్వీకరించడంతో స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది అభినందనలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్