కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడిగా ఇండస్ట్రీకి ధృవ్ విక్రమ్ పరిచయమయ్యారు. ‘ఆదిత్య వర్మ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధృవ్.. తన మొదటి చిత్రంతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. గతేడాది వచ్చిన ‘బైసన్’ చిత్రం కూడా ఆయనకు నిరాశనే మిగిల్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ధృవ్ విక్రమ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా DV4 వర్కింగ్ టైటిల్‌తో రాబోతోంది. కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేనీ, యలమంచలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల ‘డ్యూడ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ దర్శకుడు కీర్తీశ్వరన్ క్లాప్ కొట్టి ఈ కొత్త సినిమాను అధికారికంగా ప్రారంభించారు.
Print EditionDV4 వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా ప్రారంభం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)