గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అతిత్వరలో *ఎస్‌‌బిఐ ఎంఎఫ్‌ ఐపిఒ

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 10:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రూ.11,400 కోట్ల నిధులపై దృష్టి

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థగా కొనసాగుతున్న ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ స్టాక్‌ ‌మార్కెట్‌‌లో లిస్టింగ్‌‌కు రానుంది. ఇందుకోసం ఆ సంస్థ ఇన్షియల్‌ ‌పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) కోసం సిద్దమవుతోంది. ఈ ఇష్యూ జులై 13న ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన ప్రైస్ బ్యాండ్‌ను జులై9న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సెబీ నుంచి తుది అనుమతులు పొందిన ఈ ఐపిఒ ఈ ఏడాది ఆర్థిక సేవల రంగంలో రానున్న అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్లలో ఒకటిగా నిలవనుంది. సుమారు 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,400 కోట్లు) నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇష్యూ ఆఫర్‌ ‌ఫర్‌ ‌సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌) పద్ధతిలో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న ప్రమోటర్లు, వాటాదారులైన ఎస్‌‌బిఐ, ఫ్రాన్స్‌కు చెందిన అముండి తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించనున్నారు. ఇందులో కొత్త షేర్ల జారీ లేని కారణంగా సమీకరించే నిధులు నేరుగా ఆయా వాటాదారులకే వెళ్తాయి. సుమారు 20.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్