‘అరవింద సమేత’ వంటి విజయవంతమైన సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, సరికొత్త నిర్మాణంతో ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతిని అందించనుందని మేకర్స్ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రీకరణ షెడ్యూల్ తదితర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)