సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘మకుటం’. ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండో పాట ‘నచ్చాకే వచ్చేరా’ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, "ఈసారి దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. 99వ ప్రాజెక్ట్ బాధ్యతను ఆర్‌బీ చౌదరి నాపై ఉంచారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. ‘నచ్చాకే వచ్చేరా’ పాటను ప్రభ అద్భుతంగా పాడింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాను" అని అన్నారు. అంజలి మాట్లాడుతూ, "‘మదగదరాజా’ తర్వాత విశాల్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నాను. ఇందులో నేను ఓ మంచి, పవర్‌ఫుల్ పాత్రను పోషించాను" అని తెలిపారు.
‘మకుటం’లో రెండోపాట విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)