జులై 10న థియేటర్లలో విడుదల కానున్న ‘లెనిన్’ సినిమాలో శివాజీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ, "అఖిల్ ‘లెనిన్’ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నాడు. ఇందులో నాది చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్ర ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది" అని అన్నారు. ఇటీవల శివాజీ నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలు ‘లెనిన్’పై అంచనాలను మరింత పెంచాయి.
లెనిన్‌లో శివాజీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)