mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition Earthquake:వెనిజులా గుండెపగిలింది

4 రోజుల క్రితం

Venezuela earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెకన్ల వ్యవధిలో విరుచుకుపడ్డ రెండు భారీ భూకంపాలు

  • శిధిలాల కింద వేలాది మంది మరణించే అవకాశం

భారత్ తో పాటు స్పందించిన ప్రపంచ దేశాలు సెకన్ల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు భారీ భూకంపాలతో వెనిజులా గుండెపగిలింది. అనూహ్యంగా విరుచుకుపడిన మృత్యు రక్కసి మహా విధ్వంసాన్ని, విషాదాన్ని మిగిల్చింది. రాజధాని కారకస్‌‌తోపాటు పలు నగరాలు శిధిలాలమయంగా మారాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ఐదు నక్షత్రాల హోటళ్లు రాళ్ల కుప్పలుగా మిగిలాయి. బహుళ అంతస్తుల భవనాలు ఒక్కసారిగా కదలడం, రెప్పపాటులోనే కుప్పకూలిపోవడంతో ఏం జరుగుతోందో అర్థం కాని ప్రజానీకం పెద్ద సంఖ్యలో శిధిలాల కింద చిక్కుకుపోయారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన వారిని దుమ్ము మేఘాలు చుట్టుముట్టడంతో ఆర్తనాదాలు మారుమ్రోగాయి. తమ ఆత్మీయుల్లో ప్రాణాలతో ఉన్న వారెవరో, మరణించిన వారెవరో తెలియక గాలిస్తున్న ప్రజానీకం, కాళ్లు చేతులు తెగిపోయి సాయం కోసం అర్థిస్తున్న అభాగ్యులు... వెనిజులాలోని అనేక నగరాల్లో కనిపిస్తున్నారు. మృతుల సంఖ్య పది వేల నుండి లక్ష మంది దాకా ఉండవచ్చంటూ విలయం చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే యుఎస్‌ జియాలజీ సర్వీసెస్‌ ‌వేసిన అంచనాతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌‌తో పాటు, అనేక దేశాలు ఆపన్నహస్తం అందించడానికి సంసిద్దత వ్యక్తం చేశాయి. గురువారం రాత్రి 11 గంటల సమయానికి 188 మృతదేహాలను వెలికితీశారు. తొలి భూకంపం 7.2 తీవ్రతతో రాగా, ఆ వెంటనే 39 సెకన్లలో 7.5 తీవ్రతతో మరో భూకంపం విరుచుకుపడింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి కనీస వ్యవధి కూడా ప్రజలకు లభించలేదు. తీవ్ర భూకంపం తరువాత 4.9 నుండి 6.4 మధ్య తీవ్రతతో వచ్చిన 20కి పైగా ఆఫ్టర్‌ షాక్స్‌ ‌కూడా కోలుకోలేని దెబ్బతీశాయి. శతాబ్దం తరువాత వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా దీనిని శాస్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెనిజులా అంతా ఎమర్జెన్సీ విధించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఎటువైపు నుండి ముప్పు ముంచుకొస్తుందో తెలియని స్థితి నెలకొంది.
Venezuela earthquake

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్