mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాకిస్తాన్‌ దాడులు .. 29 మంది ఉగ్రవాదులు హతం

1 రోజు క్రితం

pakistan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వెంబడి చేపట్టిన నిఘా ఆధారిత భూతల ఆపరేషన్‌లో కనీసం 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్థాన్ సోమవారం తెలిపింది. కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్‌ ‌ప్రధాన కార్యాలయంపై శనివారం ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడులకు ప్రతిదాడులుగా ఉగ్రవాదుల స్థావారాలు, సురక్షిత కేంద్రాలపై దాడులు జరిపినట్లు సమాచార శాఖా మంత్రి అట్టా తరార్‌ ‌సోమవారం తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రజల్ని, అలాగే కరాచీలోని పాకిస్థాన్ రేంజర్స్ (సింధ్) క్యాంప్‌పైనా దాడులు జరపడం.. పాకిస్థాన్ అంతటా ఇటీవల జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు ప్రతిచర్యగానే ఈ దాడులు జరిగాయని తరార్ ధృవీకరించారు.

కాగా, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వెంబడి భద్రతా దళాలు పక్కా ప్రణాళికతో, నిఘా ఆధారిత క్షేత్రస్థాయి ఆపరేషన్‌ను చేపట్టాయి. సరిహద్దు ప్రాంతంలో 'జమాత్-ఉల్-అహ్రార్', 'ఫితనా-అల్-ఖవారిజ్'కు చెందిన ఉగ్రవాదుల స్థావరాలు, సురక్షిత కేంద్రాలపై లక్షిత దాడులు జరిపి ఇరవై తొమ్మిది మంది 'ఖవారిజ్'లను పాక్‌ ‌భద్రతా దళాలు హతమార్చాయని సమాచార శాఖా మంత్రి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్