వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక శాఖ తన తాజా ఆంక్షల సవరణలో భాగంగా 'స్పెషల్లీ డిజగ్నేటెడ్ నేషనల్స్' (SDN) జాబితా నుండి నాలుగు భారతీయ సంస్థలను తొలగించింది. ఈ జాబితా నుంచి తొలగించిన వాటిలో హైదరాబాద్‌కు చెందిన ఆర్ఆర్‌జి ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, లోకేష్ మెషీన్స్ లిమిటెడ్, అహ్మదాబాద్‌కు చెందిన గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్, ఢిల్లీకి చెందిన శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లు ఉన్నాయి. అమెరికాకు చెందిన 'ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్' (OFAC) ఆంక్షల జాబితాలో ఈ నాలుగు కంపెనీలను రెండేళ్ల క్రితం చేర్చడం జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఈ కంపెనీలను ఆంక్షల జాబితా నుంచి తొలగించింది. భారతీయ కంపెనీలైన ఈ నాలుగు రష్యా ప్రభుత్వానికి ఆర్థిక, భౌతిక, సాంకేతిక లేదా ఇతర విషయల్లోనూ మద్దతు అందిస్తున్నట్లు, మెక్సికోలోని మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్నట్లు అమెరికా ఆరోపించింది. అందుకు వీటిని అమెరికా లక్ష్యంగా చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14024 కింద, 2024లో ఓఎఫ్‌ఎసి 19 కంపెనీలు, ఇద్దరు వ్యక్తులతో సహా 21 భారతీయ సంస్థలపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపడానికి వాషింగ్టన్ ఈవిధమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.








కామెంట్‌లు (0)