బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జమ్ముకాశ్మీర్‌లో రూ.1.04కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ స్కామ్‌

4 గంటల క్రితం

KCC Loan Scam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 01:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో రూ.1.04కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ (కెసిసి) కుంభకోణం వెలుగుచూసినట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెకెబ్యాంక్‌ శాఖలో రోజువారీ వేతన కార్మికుడిగా పనిచేస్తూ కెసిసి రుణ పరిమితులను తారుమారు చేయడం, అనధికారిక బ్యాంకింగ్‌ లావాదేవీలు చేపట్టడం ద్వారా రూ.1.04కోట్లకు పైగా నిధులను అక్రమంగా మళ్లించినట్లు క్రైమ్‌ బ్రాంచ్‌కి చెందిన ఆర్థిక నేరాల విభాగం ఒక వ్యక్తిపై చార్జ్‌షీట్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలతో పాటు, రణబీర్‌ పీనల్‌ కోడ్‌లోని మోసం, ఫోర్జరీ, ఉద్దేశపూర్వక మోసం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి వివిధ సెక్ష‍న్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీనగర్‌లోని అవినీతి నిరోధక న్యాయస్థానంలో అదనపు ప్రత్యేక జడ్జి ఎదుట చార్జీషీట్‌ను సమర్పించిందని పేర్కొన్నారు. బుద్గామ్‌ జిల్లాలోని హంజురా నివాసితుడు అయిన రౌఫ్‌ మహమ్మద్‌ వానీ రూ.1,04,48,141 దోచుకున్నట్లు చార్జిషీట్‌ నమోదైందని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్