బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమం

3 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 11:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చలించని కేంద్ర ప్ర‌భుత్వం

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న నిరసన 12 రోజూ బుధ‌వారం కొనసాగింది. ఈ ఆందోళ‌న‌లో భాగంగా ప‌ర్యావ‌ర‌ణ కార్య‌కర్త సోన‌మ్ వాంగ్‌చుక్ నిర‌వ‌ధిక‌ నిరాహార దీక్ష నాలుగో రోజూ కొన‌సాగింది. నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌తో సహా పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది చికిత్స పొందుతున్నారు. వాంగ్‌చుక్ రక్తంలో చక్కెర స్థాయి చాలా తగ్గిపోయిందని వైద్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆందోళ‌న‌కారుల‌ ప్రాణాలతో ఆడుకుంటోందని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తోంద‌ని ధ్వ‌జమెత్తారు. విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను స‌రిదిద్దేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని, అందుకే ఆందోళ‌న చేస్తున్న‌వారి గొంతు వినేందుకు సిద్ధ‌ప‌డ‌టం లేద‌ని అన్నారు. ఆందోళ‌న‌కారులకు మద్దతుగా పలువురు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు జంతర్ మంతర్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్