బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్’కు చంద్రబాబు శంకుస్థాపన

1 గంట క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 11:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సత్యవేడు (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్–2.0కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశను చూపడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. హీరో మోటోకార్ప్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విడిభాగాల సరఫరాను మరింత వేగవంతం చేయడం, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సిఇఒ హర్షవర్థన్‌ చిట్లే మాట్లాడుతూ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పవన్ ముంజాల్ మార్గదర్శకత్వంతో ఈ ప్రాజెక్టు అమలవుతోందని, హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ 103వ జయంతి శతజయంతి సందర్భంగా ఈ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అనంతరం హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పవన్ ముంజాల్, అనీషా ముంజాల్, చిట్లే తదితరులతో కలిసి ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించి, భవిష్యత్తు ఉత్పత్తి, నిల్వ, పంపిణీ విధానాలపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్‌ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎ‌స్‌‌పి ఎల్.సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూళ్లూరుపేట ఆర్‌‌డిఒ దేవేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామమోహన్‌రావు పాల్గొన్నారు. సిఎంను, మంత్రి అనగానిని పవన్ ముంజాల్ సన్మానించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్