ఎపి ఇఎపి సెట్‌లో రెండో ర్యాంకు సాధించిన సిక్కోలు విద్యార్థిని శ్రావ్య
ప్రజాశక్తి - పొందూరు (శ్రీకాకుళం జిల్లా) : సివిల్స్ పరీక్షలు రాసి ఐఎఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఎపి ఇఎపి సెట్ ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణ విద్యార్థిని కోరుకొండ శ్రావ్య తెలిపారు. 160 మార్కులకు గానూ 151.08 మార్కులను ఆమె సాధించారు. ఆలిండియా ఉమెన్ కేటగిరీలో రెండో ర్యాంకు, మద్రాస్ జోన్ పరిధిలో ఒకటో ర్యాంకు సాధించారు. జెఇఇ మెయిన్స్ ఫలితాలలో 108వ ర్యాంకు సాధించారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఇఎపి సెట్‌లోనూ 17వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. జాతీయస్థాయిలో నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 111వ ర్యాంకు, ఒబిసి కేటగిరీలో 17వ ర్యాంకు సాధించారు. శ్రావ్య తండ్రి కోరుకొండ కృష్ణారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా, తల్లి లక్ష్మీరాజ్యం ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.








కామెంట్‌లు (0)