సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చుక్కపల్లి విజయ్ కుమార్ హఠాన్మరణం

03 ఆగస్టు, 2026

vijay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు నివాళి

- నేడు అంతిమయాత్ర

ప్రజాశక్తి- విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి పిచ్చయ్య చిన్న కుమారుడు, పాపులర్ షూమార్ట్, చైతన్య ఫుట్ వేర్ మేనేజింగ్ పార్టనర్ చుక్కపల్లి విజయ్ కుమార్ (67) సోమవారం కన్నుమూశారు. విజయవాడ గాంధీనగర్లోని తన గృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ముగ్గురు కుమారులు అవినాష్, అభిలాష్, అన్వేష్ ఉన్నారు. పెద్ద కుమారులు ఇద్దరు వ్యాపార రంగంలో ఉండగా, చిన్న కుమారుడు డాక్టర్. కోడళ్లు డాక్టర్ సౌమ్య, రమ్య ఉన్నారు. చుక్కపల్లి పిచ్చయ్యకు కుమార్తె శాంతికుమారి, కుమారులు అరుణ్ కుమార్, అమర్ కుమార్, విజయ్ కుమార్ కాగా, ఐదేళ్ల క్రితం అమర్ కుమార్ మృతి చెందారు. విజయవాడ కేంద్రంగా ఆరు దశాబ్దాలకుపైగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన పాపులర్ షూ మార్ట్ ప్రముఖ వ్యాపార సంస్థగా పేరుగాంచింది. విజయ్ కుమార్ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ఉద్యోగుల సంక్షేమం, వారి పిల్లల విద్యాభివృద్ధికి ఉదారంగా విరాళాలు అందిస్తూ మానవతా విలువలను ఆచరణలో చూపించారు. ఆయన మృతి విజయవాడ వ్యాపార వర్గాలను, సన్నిహితులను తీవ్ర విషాదంలో నింపింది. విజయ్ కుమార్ అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కృష్ణలంక స్వర్గపురి స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు.

పలువురి నివాళి

గాంధీనగర్లోని పాపులర్ షూమార్ట్ భవనంలో ఉంచిన చుక్కపల్లి విజయ్ కుమార్ భౌతికకాయాన్ని పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, బి.తులసీదాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరామ్‌, డివి కృష్ణ, ఐలు ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎపి బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, సిపిఐ జాతీయ నాయకులు అక్కినేని వనజ, ఎంఎల్‌ఎ బొండా ఉమామహేశ్వరరావు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

బివి.రాఘవులు దిగ్ర్భాంతి

విజయ్‌‌ కుమార్‌ ‌మృతి పట్ల సిపిఎం పొలిట్‌‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఒక ప్రకటనలో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మాజీ ఎంఎల్‌ఎ పాటూరు రామయ్య సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.


cpm


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్