ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక కార్యకర్త ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే, విమర్శించే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులని పేర్కొన్నారు. విమర్శించినా, ప్రశ్నించినా ప్రభుత్వమే కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికమని తెలిపారు. ఒక వైపు అధికారం పార్టీల సోషల్ మీడియా విచ్చలవిడిగా దాడి చేస్తున్నా మాట్లాడని పోలీసులు రావణ్ ను ఆఘమేఘాల మీద అరెస్టు చేయడం ప్రభుత్వ పక్షపాత వైఖరిని నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వాల, ప్రజాప్రతినిధులను విమర్శించడం నేరం కాదని, విమర్శలను సహించే సంస్కృతి ప్రజాస్వామ్యానికి మూలస్థంభమని తెలిపారు. రావణ్‌లపై నమోదైన అక్రమ కేసులను ఉపసంహరించుకొని, చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Print Editionరావణ్ అరెస్ట్ అన్యాయం : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 11:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)