అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ప్రజాశక్తి-అమరావతి : తాడేపల్లి పోలీస్టేషన్‌లో నమోదైన కేసులో వైసిపి నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాలవజ్రబాబు, పోనుగంటి చైతన్య తదితరులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తును కొనసాగించొచ్చని స్పష్టం చేసిన న్యాయస్థానం, దర్యాప్తు అధికారికి పూర్తిగా సహకరించాలని, పిలిచినప్పుడల్లా విచారణకు హాజరుకావాలని పిటిషనర్లను ఆదేశించింది.
ఫిర్యాదుదారుడు తెనాలి మాణిక్యంకు నోటీసులు జారీ చేసి కేసు విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. రైతుల పరిరక్షణ కమిటీ పర్యటన సందర్భంగా ఉండవల్లి వద్ద జరిగిన ఘటన అనంతరం తమపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని పేర్కొంటూ వైసిపి నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.








కామెంట్‌లు (0)