శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు.. 40మంది మృతి

2 గంటల క్రితం

southwest Pakistan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు హైవే పై నుండి లోయలో పడిన ఘటనలో 40మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం క్వెట్టా నుండి పెషావర్‌ వెళ్తున్న బస్సు పర్వతప్రాంతమైన దానాసర్ వద్ద లోతైన లోయలో పడిపోయిందని జోబ్‌ జిల్లా అత్యవసర సేవల కేంద్రం అధ్యక్ష‍ుడు సనావుల్లా షెరానీ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆసమయంలో బస్సులో 48మంది ప్రయాణికులు ఉన్నారని అన్నారు. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం, అత్యంత వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 40మంది మరణించగా, మరో 8మంది గాయపడ్డారని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్