ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం) : టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు గురువారం రాత్రి 9 గంటలకు అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా, మండల, స్థానిక నాయకులు హనుమంతరావు మృతదేహానికి ఎర్ర జెండా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ .... పొందూరు గ్రామానికి సిపిఎం తరుపున సుదీర్ఘ కాలం 30 సంవత్సరాలు సర్పంచ్ గా పరిటాల కోటయ్య పనిచేస్తే ఆ పార్టీ కి హనుమంతరావు పొందూరు గ్రామంలో నాయకత్వం వహించారు అని గుర్తు చేశారు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యునిగా మంచి క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా హనుమంతరావు గుర్తింపు పొందారు అని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం, సిపిఎం అభివృద్ధి కోసం చనిపోయంతవరకు ఎర్ర జండా ను వదలకుండా పనిచేసిన హనుమంతరావు కి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, జాల అంజయ్య, పునాటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎస్కె. మాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. వి. కొండారెడ్డి, కె. ఆంజనేయులు, ఎమ్. రమేష్, ch.శ్రీనివాస్, కాలం సుబ్బారావు, కేజీ. మస్తాన్, జె. జయంతిబాబు, జి. శ్రీనివాసులు, టీ. రాము, వి.మోజెస్, వి.సింగయ్య, మల్లెల కొండయ్య వి.సుబ్బారావు, సిపిఐ(యంల్ ) పార్టీ నాయకులు డి వి ఎన్. స్వామి, పి.కోటేశ్వరరావు, పి.సుబ్బారావు, బి.శివరామకృష్ణ, వీరితో పాటు టీడీపీ, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు కి జోహార్లు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)