గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​మూడోరౌండ్‌‌కు సబలెంకా, ముఛోవా

1 రోజు క్రితం

Muchova, Sabalenka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లండన్‌: వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ మహిళల సింగిల్స్‌ లో టాప్‌‌సీడ్‌, బెలారస్‌‌కు చెందిన అర్యానా సబలెంకా, 10వ సీడ్‌, చెక్‌ ‌రిపబ్లిక్‌‌కు చెందిన ముఛోవా అదరగొట్టారు. బుధవారం జరిగిన రెండోరౌండ్‌ ‌పోటీలో సబలెంకా 6-1, 7-6(11-9)తో కెస్టర్‌(అమెరికా)పై, ముఛోవా 6-3, 6-2తో జంగ్‌(‌చైనా)పై వరుస సెట్లలో విజయం సాధించారు. ఇతర పోటీల్లో ఒస్టాపెంకో (లాత్వియా) 6-2, 6-0తో ఏంబోలినియ రుజిచ్‌(‌క్రొయేషియా), 14వ సీడ్‌, జపాన్‌ ‌భామ ఒసాకా 6-3, 6-2తో అనస్తాసియా (రష్యా)ను వరుససెట్లలో ఓడించి మూడోరౌండ్‌‌కు చేరారు. ఇక బౌజస్‌6-3, 6-7(1-7), 6-2తో యాస్ర్టమ్స్య(ఉక్రెయిన్‌)‌పై మూడుసెట్ల హోరాహోరీ పోరులో విజయం సాధించి మూడోరౌండ్‌‌కు చేరారు. ఇక పురుషుల సింగిల్స్‌‌లో టాప్‌‌సీడ్‌ ‌జెన్నిక్‌ ‌సిన్నర్‌, డి. మెద్వదెవ్‌ మూడోరౌండ్‌‌కు చేరారు. టాప్‌‌సీడ్‌ ‌సిన్నర్‌ 7-6(7-4), 7-6(7-2), 6-4తో వరుససెట్లలో బోర్గెస్‌(‌పోర్చుగల్‌)పై, మెద్వదెవ్‌ 3-6, 6-3, 7-5, 6-2తో స్పెయిన్‌‌కు చెందిన డానియేల్‌‌ను ఓడించారు. 21వ సీడ్‌ టామీ పాల్‌(అమెరికా) 6-3, 7-6(7-1), 6-2తో క్వాన్‌(‌కొరియా)ను ఓడించి మూడోరౌండ్‌‌కు చేరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్