గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWimbledon : మూడోరౌండ్‌‌కు జ్వెరేవ్‌, డి మినార్‌

1 గంట క్రితం

zverev
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

లండన్‌: వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ పురుషుల సింగిల్స్‌ ‌మూడోరౌండ్‌‌లోకి 2వ సీడ్‌, ఆండీ జ్వెరేవ్‌(జర్మనీ), 5వ సీడ్‌ ఆస్ర్టేలియాకు చెందిన డి మినార్‌ ‌ప్రవేశించారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ ‌పోటీలో డి మినార్‌ 6-3, 6-2, 6-2తో వరుససెట్లలో మన్నారినో(ఫ్రాన్స్‌)‌ను, జ్వెరేవ్‌ 6-1, 6-3, 7-6(7-3)తో వలెంటివ్‌(ఫ్రాన్స్‌)ను చిత్తుచేశారు. మరో పోటీలో టి. ఫ్రిట్జ్‌ 6-2, 6-2, 7-5తో అమెరికాఏ చెందిన ప్యాట్రిక్‌ ‌కెప్సన్‌‌ను చిత్తుచేశాడు. ఇక మహిళల సింగిల్స్‌‌లో 3వ సీడ్‌, పోలండ్‌‌కు చెందిన ఇగా స్వైటెక్‌, 26వ సీడ్‌, అమెరికాకు చెందిన కీస్‌ ‌వరుససెట్లలో ప్రత్యర్ధులపై గెలిచి మూడోరౌండ్‌‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ ‌పోటీలో స్వైటెక్‌ 6-1, 6-4తో ప్లిస్కోవా(చెక్‌)‌ను, కీస్‌ 6-1, 7-5తో క్కైటీ స్వాన్‌(‌బ్రిటన్‌)‌ను ఓడించారు. ఇతర పోటీల్లో బోజ్కోవా(చెక్‌) 7-5, 6-3తో టైరా(నెదర్లాండ్‌)‌ను చిత్తుచేయగా.. 23వ సీడ్‌ అమెరికాకు చెందిన నవ్వార్రో 3-6, 6-4, 6-1తో సెలెట్మోవా(రష్యా)పై మూడుసెట్ల హోరాహోరీ పోరులో విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌లో వై. బాంబ్రీ-వీనస్‌(ఆస్ర్టేలియా) పోరాటం తొలిరౌండ్‌లో ముగిసింది. వీరు తొలిరౌండ్‌లో 3-6, 4-6తో అమెరికా, ఫ్రాన్స్‌ జంట చేతిలో వరుససెట్లలో ఓడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్