- ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కామ్రేడ్ అంగలకుర్తి బ్రహ్మయ్య మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఎఐఎడబ్ల్యుయు) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. బ్రహ్మయ్య నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు కార్యకర్తగా.. పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కూలి, భూమి సమస్యలతో పాటు పొగాకు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేవారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేళ్లూనుకున్న కులవివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని, పేదలు, అణగారిన ప్రజల పక్షాన నిలబడి వారి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. జిల్లా స్థాయిలో పనిచేస్తూ ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావంతో, నిబద్ధతతో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు. ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతాయి.
బ్రహ్మయ్య మృతికి సంతాపం
ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు అంగలకుర్తి బ్రహ్మయ్య మృతికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి, ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు.








కామెంట్లు (0)