శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రావాడ పంచాయతీలో వియ్యపు సరోజిని ఘన విజయం

11 నిమిషాల క్రితం

Resounding victory for Viyyapu Sarojini in Ravada Panchayat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 1,423 ఓట్ల భారీ మెజారిటీతో కత్తెర గుర్తు అభ్యర్థి గెలుపు

- 12 వార్డుల్లోనూ ఆధిక్యం సాధించిన సరోజిని

- 2013లో వియ్యపు కుటుంబానికి.. 2026లోనూ అదే కుటుంబానికి సర్పంచ్ పీఠం


పరవాడ (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రావాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వియ్యపు సరోజిని చిన్నా 1,423 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కత్తెర గుర్తుపై పోటీ చేసిన ఆమె పంచాయతీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లోనూ ఆధిక్యం సాధించి తన విజయాన్ని సుస్థిరం చేసుకున్నారు. గ్రామ పంచాయతీలోని అన్ని వర్గాల ప్రజలు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు పలకడంతో ఈ విజయం సాధ్యమైంది. రావాడ పంచాయతీ రాజకీయ చరిత్రలో వియ్యపు కుటుంబానికి మరోసారి సర్పంచ్ పీఠం దక్కడం విశేషంగా మారింది. 2013లో వియ్యపు కుటుంబానికి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించగా, 13 ఏళ్ల తర్వాత 2026లో అదే కుటుంబానికి చెందిన వియ్యపు చిన్నా సతీమణి వియ్యపు సరోజిని సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో రావాడ పంచాయతీలో వియ్యపు కుటుంబ రాజకీయ ప్రస్థానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కుల, మత, వర్గాలకు అతీతంగా గ్రామ ప్రజలు భారీ మెజారిటీ అందించడం ఆమెపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సరోజిని గ్రామంలోని తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ రావాడ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాలని పలువురు గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్