శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.16,546 కోట్లు ఇవ్వండి

26 ఆగస్టు, 2026

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 06:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- లోటు నిధులపై కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రావాల్సిన లోటు నిధులివ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మొత్తం రూ.32,265 కోట్లు రావాల్సి ఉండగా, అందులో ఇప్పటి వరకు దాదాపు సగం నిధులు మాత్రమే వచ్చాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వ్యయ విభాగం కార్యదర్శిని రాష్ట్ర ఆర్థికశాఖ కోరింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.16,078.76 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు వచ్చిన నిధుల్లో రూ.3,979.50 కోట్లు, రూ.138.39 కోట్లు, రూ.1,500 కోట్లు, రూ.10,460.87 కోట్లుగా నాలుగు విడతల్లో అందినట్లు ఆర్థికశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా రూ.16,546.49 కోట్లు రావాల్సి ఉందని, వాటిని కూడా విడుదల చేయాలని ఆర్థికశాఖ కోరింది. కొద్దిరోజుల క్రితం జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ భేటీలో కూడా ఇవే అంశాలను ప్రస్తావించడం గమనార్హం.


రావాల్సిన నిధుల వివరాలు (రూ.కోట్లలో)

లోటునిధులు18,330.45

10వ వేతన సవరణ సంఘం బకాయిలు3,882.13

వ్యవసాయ రుణ విమోచన బకాయిలు7,069.67

వృద్ధాప్య పింఛన్ల బకాయిలు3,343.00

మొత్తం32,625.25

ఇప్పటి వరకు వచ్చింది16,078.76

ఇంకా రావాల్సింది16,546.49

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్