శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఎం ఆర్‌‌కెవివై – పిడిఎంసి పథకానికి రూ.100 కోట్లు

03 ఆగస్టు, 2026

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ఉద్యానవన శాఖకు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పిఎం ఆర్‌‌కెవివై) – పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పిడిఎంసి) పథకం అమలుకు రూ.100.69 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో భాగంగా ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను సూక్ష్మ, బిందు సేద్యం విస్తరణ, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ కార్యక్రమం అమలుకు వినియోగించనున్నారు. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం రూ.400 కోట్లలో ఇప్పటికే రూ.211.57 కోట్లు అనుమతించగా, తాజాగా మరో రూ.100.69 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పథకం అమలుకు వినియోగించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్