గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

54 నిమిషాల క్రితం

సత్య సాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించారు. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరి

​ప్రజాశక్తి-సోమందేపల్లి : జిల్లాలోని 32 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ మారుతికి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ‌వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో అత్యంత లోటు వర్షపాతం(65శాతం) మన జిల్లాలో నమోదైందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. జిల్లాలో 12.6 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా కేవలం 2.74 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైందన్నారు. సాగైన పంటలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో వచ్చిన తుఫాను వల్ల బోర్ల కింద వేసిన పంటలు సైతం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వర్షాభావం, అకాల వర్షాల నష్టాన్ని తట్టుకోలేని రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయన్నారు. భూగర్భ జలాలు 10 మీటర్లకు పైగా పడిపోయి పండ్ల తోటలూ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో 826 గ్రామాల్లో తాగు నీటి సమస్య నెలకొందన్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు మేత, నీటి సమస్య తలెత్తడంతో పాడి రైతులు, పశుపోషకులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సాగు విస్తీర్ణం తగ్గి వ్యవసాయ పనులు లేక ఉపాధి కూలీలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కావున వెంటనే జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మాబు, సభ్యులు వెంకటేష్, రామకృష్ణ, నాగరాజు, రైతు సంఘ నాయకులు భాస్కర్, నందగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్