శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చోరీ యత్నం విఫలం - పట్టుబడిన దొంగలు

13 నిమిషాల క్రితం

Attempted theft foiled thieves caught
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 05:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణంలోని తేరువీధిలో నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించి ఇద్దరు దొంగలు పట్టుబడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. గుమ్మగట్ట మండలం దేవిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశులు అను రైతు తేరు వీధిలోని యూనియన్ బ్యాంకు నుండి రెండు లక్షల రూపాయలు నగదు తీసుకువచ్చాడు. సమీపంలో గల హోటల్లో టీ తాగుతుండగా పక్కన పెట్టుకున్న నగదు బ్యాగును గమనించిన దొంగలలో ఒకరు హోటల్ ముందు మోటార్ సైకిల్ పై కూర్చుని ఉండగా మరొకరు నగదు ఉన్న బ్యాగును తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గమనించి గట్టిగా దొంగ అని కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పుడప్పుడు బ్యాంకుల వద్ద దొంగలు ప్రజలను ఏమార్చి వారి వద్ద గల నగదును ఎత్తుకెళ్లేవారు. ఈసారి దొంగలు పట్టుబడ్డారు. వారు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
012


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్