ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పంచాయితీల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ను శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు, బ్యాలెట్ పత్రాల నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ... పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి పొరపాట్లకుతావులేకుండా నిర్వహించాలని సూచించారు. పరిశీలన కార్యక్రమంలో ఎంపిడిఓ ఎవిఎస్ చంద్రశేఖర్, ఎన్నికల స్టేజ్.2 సిబ్బంది ఉన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
7 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)