శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమ్మడి కడపలో కరువు ఛాయలు

12 గంటల క్రితం

ఉమ్మడి కడపలో కరువు ఛాయలు
- ఎండిపోయిన చీనీ, మామిడి తోటలు
- తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలి 
- సిపిఎం కరువు బృందం డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎండిపోయిన చీనీ, మామిడి తోటలు

- తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలి

- సిపిఎం కరువు బృందం డిమాండ్‌

ప్రజాశక్తి-ఎర్రగుంట్ల, రామాపురం : ఎల్‌‌నినో ప్రభావంతో వైఎస్‌ఆర్‌ ‌కడప జిల్లాలో పంటల సాగు ఆశించిన స్థాయిలో జరగలేదని, ఫలితంగా ఇప్పటికే కరువు ఛాయలు అలుముకున్నాయని సిపిఎం కరువు బృందం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు బృందాలను పంపి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని, రైతులకు కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కరువు బృందం శుక్రవారం వైఎస్‌ఆర్‌ ‌కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలోని సిరాజుపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా రామాపురం మండలం వసంతవాండ్ల పల్లె గ్రామాన్ని పర్యటించింది. ఎండిపోయిన చీనీ తోటలు, ఎండిపోయిన మామిడి తోటలను పరిశీలించి, రైతుల నుంచి వివరాలు సేకరించింది. అనంతరం సిపిఎం రాష్ర్ట నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. ఈ పరిస్థితి పై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర కరువు నివేదిక పంపి, అత్యవసర ఆర్థిక సహాయం చేయాలని కోరారు. కరువు ప్రభావిత మండలాలను ప్రకటించి, ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌‌లో 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. 15 ఏళ్లుగా పెంచుకున్న మామిడి చెట్లు కళ్లముందే ఎండిపోవడంతో కొందరు వాటిని నరికి కట్టెలుగా విక్రయిస్తున్నారని, మరికొందరు చెట్లను తొలగించలేక ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎండిన ప్రతి మామిడి చెట్టుకు రూ.15 వేలు, ఎకరాకు రూ.రెండు లక్షల చొప్పున పరిహారం అందించాలని, వసంతవాండ్ల పల్లెను తీవ్ర కరువు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. కరువు రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తే, రానున్న కాలంలో దశలవారీ పోరాటాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్