గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపి రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌ రెడ్డి

3 రోజుల క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కోశాధికారిగా మర్రాపు సూర్యనారాయణ

- 66 మందితో 
నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ ‌రైతు సంఘం రాష్ట్ర ఆధ్యక్షులుగా వి.కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శిగా కె.ప్రభాకర్‌ ‌రెడ్డి, కోశాధికారిగా మర్రాపు సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఏలూరులో మూడు రోజులపాటు జరిగిన సంఘం 23వ రాష్ట్ర మహాసభ ఆదివారంతో ముగిసింది. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ మహాసభలో చివరి రోజున నూతన రాష్ట్ర కమిటీకి 66 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వై.కేశవరావు, జొన్న శివశంకరరావు, పివి.ఆంజనేయులు, మూలి వెంగయ్య, పి.హేమలత, ఆర్‌.చంద్రశేఖర్‌‌రెడ్డి, గౌరుశెట్టి నాగేశ్వరరావు, ఆకుల హరేరామ్‌, వల్లూరు భారతి, సహాయ కార్యదర్శులుగా ఎ.హరి, జి.రామకృష్ణ, టి.రామచంద్రుడు, జె.జయంతిబాబు, కంచుమాటి అజయ్‌‌కుమార్‌, కె.శ్రీనివాస్‌, ఎం.అప్పలరాజు, బుద్దరాజు రాంబాబు ఎన్నికయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్